- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
చింతలపాలెం మండలం బుగ్గ మాధవరం గ్రామసమీపంలో కృష్ణా నది పై నిర్మాణంలో ఉన్న రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం పనులను మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

దిశ, చింతలపాలెం : చింతలపాలెం మండలం బుగ్గ మాధవరం గ్రామసమీపంలో కృష్ణా నది పై నిర్మాణంలో ఉన్న రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం పనులను మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పరిధిలో చేపడుతున్న భూగర్భ (అండర్‌గ్రౌండ్) పంప్‌హౌస్, కాలువలు, విద్యుత్ వ్యవస్థలు తదితర నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం రూ.394 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే మేళ్లచెరువు, చింతలపాలెం, కోదాడ, చిలుకూరు మండలాల పరిధిలోని 14,100 ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తి పెరగడంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు.
మేళ్లచెరువు మండలంలోని కందిబండ, రామాపురం గ్రామాలు, చింతలపాలెం మండలంలోని దొండపాడు గ్రామం, కోదాడ మండలంలోని గణపవరం, కూచిపూడి, ఎర్రవరం, రామలక్ష్మీపురం, బిక్యా తండా, తొగర్రాయి గ్రామాలతో పాటు చిలుకూరు మండలంలోని పలు గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం 35 ఎకరాల భూమిని సేకరించి, రైతులకు రూ.17.50 కోట్ల నష్టపరిహారం చెల్లించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల అమలులో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేదా లోపాలు ఉండకూడదని అధికారులకు, గుత్తేదారులకు స్పష్టం చేశారు. రైతులకు త్వరగా ప్రయోజనం చేకూరేలా పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఇరిగేషన్ ఎస్‌ఈ నాగభూషణం, డీసీసీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, వంగవీటి రామారావు, గెల్లి రవి, నరాల కొండారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






