- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కళ్యాణ్ విషయంలో తెలంగాణ యువత జాగ్రత్తగా ఉండాలి
శనివారం హనుమకొండ బాలసముద్రంలో జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు కవిత.

దిశ, హనుమకొండ కలెక్టరేట్: ముఖ్యమంత్రి డైరెక్షన్ లో వేల కోట్ల దోపిడీ జరుగుతోందని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలో జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీలకు తెలంగాణ వచ్చాక ఒక్క కొత్త చెప్పుకోదగ్గ విద్యా సంస్థ రాలేదన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి కల్పన విషయంలో తెలంగాణకు ఏం మంచి జరగలేదని వెల్లడించారు.
కాకతీయ యూనివర్సిటీలో హాస్టల్ లేక విద్యార్థులు బయట ఉండి చదువుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. వెంటనే హాస్టల్ భవనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టెక్స్ టైల్ పార్క్ కోసం కేటాయించిన 2400 ఎకరాలను లే అవుట్ చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన డైరెక్షన్ లో మంత్రులు పొంగులేటి, సీతక్క దోపిడీని కొనసాగిస్తున్నారని ఆరోపణలు చేశారు. సీతమ్మ సాగర్ బ్యాక్ వాటర్ నుంచి 70 కిలోమీటర్ల మేర ఇసుక దోపిడీ చేస్తున్నారు. దీని కారణంగా గోదావరికి గర్భశోకం మిగులుతోందని ఫైర్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ విషయంలో తెలంగాణ యువత జాగ్రత్తగా ఉండాలని కోరారు. సినిమా యాక్టర్ల ముసుగులో వాళ్లు మన మీద ఆధిపత్యం కోసం వస్తారన్నారు. గతంలో కూడా ఇలాగే వచ్చి మన భాష బాగాలేదంటూ మనల్ని అవమానించారని తెలిపారు. తెలంగాణ యాసను సినిమాల్లో రౌడీలకు పెట్టి మనల్ని అవమానించారని సీరియస్ అయ్యారు. ఇక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాం అంటే ఊరుకునేది లేదంటూ పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు భానోత్ వెంకన్న, ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ నడిపెల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






