బెదిరింపులకు పాల్పడుతోన్న సర్పంచ్ భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్

by Kodari Anjali |

బెదిరింపులకు పాల్పడుతున్న సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఓ కుటుంబం ఫిర్యాదు చేసింది.

బెదిరింపులకు పాల్పడుతోన్న సర్పంచ్ భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
X

దిశ, పెద్దేముల్: తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరినందుకు గాజీపూర్ సర్పంచ్ భర్త లాల్ రెడ్డి తమను అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని అదే గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ దేవనూరు సత్యమ్మ శనివారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జీవనోపాధి కోసం తాము ఏర్పాటు చేసుకున్న వాటర్ ప్లాంట్‌ను ఎలా నడిపిస్తారో చూస్తానని వేధిస్తున్నారని, ఎన్నికల్లో తమకు ఓట్లు వేయలేదనే కక్షతోనే లాల్ రెడ్డి తనతో పాటు తన కోడలు నాగమణిని అవమానిస్తూ, కొడుకుల అంతు చూస్తామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లాల్ రెడ్డి వల్ల తమ కుటుంబ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఆయనపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని సత్యమ్మ పోలీసులను మరియు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. తనపై అవాస్తవమైన ఆరోపణలు చేస్తున్నారు. గాజీపూర్ సర్పంచ్ భర్త లాల్ రెడ్డి ఇది విషయమై గాజీపూర్ సర్పంచ్ భర్త లాల్ రెడ్డి నీ వివరణ కోరగా.. గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌కు అనుమతులు తీసుకోవాలి అని చెప్పినందుకు తనపైన అవస్తవమైన ఆరోపణలు చేస్తూ తనపైన కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తను ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదని, పంచాయతీ వ్యవహారాలు తను పట్టించుకోనని తనపై లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ భర్త లాల్ రెడ్డి వివరణ ఇచ్చారు.

Next Story