- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమల్ హాసన్ లాంటి నటుడు దొరికేశాడు.. వైరల్‌గా డైరెక్టర్ కామెంట్స్
వైవిద్యమైన పాత్రలు ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ ‘రావు బహదూర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

దిశ, సినిమా: వైవిద్యమైన పాత్రలు ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ ‘రావు బహదూర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అప్లాజ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై భారీ క్రియేట్ అయ్యేలా చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్‌లో దర్శకుడు వెంకటేష్ మహా, సత్యదేవ్‌ను ఉద్దేశించిన చేసిన కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘మొన్న మా టీమ్ అందరం కలిసి సినిమా ఎలా వచ్చిందా అని చూస్తున్నాం. అప్పుడు ఎవరో అన్నారు ‘కమల్ హాసన్ గారు ఏదో సందర్భంలో నా నెక్ట్స్ జనరేషన్‌లో కనుక నా అంత పెర్ఫామెన్స్ చేయగలిగే యాక్టర్ నాకు కనిపిస్తే నేను రిటైర్ అవుతాను’ అని అన్నారు అంటా. కమల్ హాసన్ సర్ మీరు రిటైర్ అవ్వొద్దు.. ఎందుకంటే గత 50, 60 ఏళ్ల నుంచి మా అందరికి ఇన్స్‌పిరేషన్ ఇస్తూ వచ్చారు. కాబట్టి మీరు మా మధ్య ఉండాలి రిటైర్ అవ్వకూడదు. కానీ, మీరు అనుకుంటున్న నెక్ట్స్ జనరేషన్‌లో మీరు అనుకుంటున్న, మీ అంతటి పెర్ఫామెన్స్ చెయ్యగలిగే యాక్టర్ ఒకడు వచ్చేశాడు. ఆయన పేరే సత్యదేవ్’ అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్.






