- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ వేదికగా మెట్రో ఫేజ్-2 పంచాయతీ..కిషన్ రెడ్డికి సీఎం మరోసారి లేఖ!
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పెండింగ్ నిధులపై కేంద్రంతో చర్చలు.. రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేయాలంటూ కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ!

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2కు సంబంధించిన పెండింగ్ అంశాలకు ఢిల్లీ వేదికగా మారింది. నిధుల విడుదలపై న్యూఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ విషయమై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ పనులు, ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC - ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్) నిధుల విడుదలకు సంబంధించిన పెండింగ్ అంశాల త్వరితగతిన పరిష్కారం కోసం కేంద్ర మంత్రి చొరవ చూపాలని, ఈ విషయమై జూన్ 16న తాను రాసిన మునుపటి లేఖను సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు.
జూన్ 22, 23 తేదీల్లో తాను న్యూఢిల్లీ పర్యటనలో ఉండనున్నట్లు లేఖలో పేర్కొన్న ముఖ్యమంత్రి.. ఈ పర్యటనలోనే కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యేలా సమయం కేటాయించాలని కోరారు. కిషన్ రెడ్డి తో కలిసి తాను రైల్వే మంత్రిని స్వయంగా కలవాలని భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగర ప్రయాణ అవసరాలకు అత్యంత కీలకమైన ఈ పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సమావేశం ఒక నిర్మాణాత్మక వేదికగా మారుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చలకు అవసరమైన సంబంధిత అధికారిక ఒప్పందాలు, నివేదికల ప్రతులను కూడా తానే స్వయంగా వెంట తీసుకు వస్తానని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి, వీలైనంత త్వరగా ఈ సమావేశ వివరాలను ఖరారు చేసి తనకు తెలియజేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాసిన లేఖలో సీఎం కోరారు.






