- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోక్ అదాలత్‌లో 51 వేల కేసులు పరిష్కారం..
కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్‌లు ఉత్తమ మార్గమని రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మెన్ అన్నారు

దిశ, చైతన్యపురి: కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్‌లు ఉత్తమ మార్గమని రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మెన్ కర్ణకుమార్ అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలో గల అన్ని కోర్ట్ ప్రాంగణాలలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌లు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఈ లోకదాలత్‌లో కేసులు సెటిల్ చేసుకోవడం ద్వారా తాము సివిల్ కేసులలో చెల్లించిన కోర్ట్ ఫీస్ కూడా తిరిగి పొందవచ్చునని చెప్పారు. తమ కేసులను అనగా ఆస్తి పరమైన, కుటుంబ సమస్యల కేసులు పరిష్కారం చేసుకోవడానికి ఈ లోక్ అదాలత్ మధ్యవర్తిత్వం ఒక మంచి వేదికన్నారు.
25 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు...
లోక్ అదాలత్ లో కేసు రాజీ అవ్వడం ద్వారా ఇరు వర్గాలు గెలిచినట్టేనని పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి. అనూష మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అన్ని కోర్ట్ ప్రాంగణాలలో 25 లోక్ అదాలత్ బెంచిలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో రాజీకి ఆమోద యోగ్యమైన క్రిమినల్, సివిల్ దావాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా కేసులు, కన్జ్యూమర్ కోర్టు కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించుకొన్నారని తెలిపారు. ఇందులో రాజీకి ఆమోద యోగ్యమైన క్రిమినల్, సివిల్, మోటార్ వాహన ప్రమాదభీమా కేసులు, బ్యాంకు రికవరీ ప్రీటిగేషన్ కేసులు అన్ని కలిపి సుమారు 51 వేల పైచిలుకు కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. అన్ని కేసులలో కలిపి రూ. 7,54,43,179 వరకు నష్ట పరిహారాన్ని కక్షిదారులకు అందించామన్నారు.






