- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ అనుమతులు వెంటనే నిలిపేయండి..డీకే అరుణకు వినతి
by velandi.Saikiran |
గున్ముక్ల మాలగుట్టలో ప్రతిపాదిత మైనింగ్ కార్యకలాపాల కోసం కొనసాగే అనుమతులు వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందించారు అఖిలపక్ష నాయకులు.

X
దిశ, ధన్వాడ: గున్ముక్ల మాలగుట్టలో ప్రతిపాదిత మైనింగ్ కార్యకలాపాల కోసం కొనసాగే అనుమతులు వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందించారు గున్ముక్ల మాలగుట్ట పరిరక్షణ అఖిలపక్ష నాయకులు. శనివారం ఎంపీ నివాసంలో ప్రత్యేక కలిసి తమ సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా మాలగుట్ట పరిసర గ్రామాల ప్రజల ఆందోళనలు, పర్యావరణ జీవనాధారాలపై మైనింగ్ ప్రభావాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎంపీ డీకే అరుణ, సమస్యపై సానుకూలంగా స్పందించారు. సంబంధిత మైనింగ్ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో గున్ముక్ల, యంనోనిపల్లి, మంత్రోనిపల్లి, కంసాన్‌పల్లి, గుడిగండ్ల గ్రామ అఖిలపక్ష నాయకులు వినతి పత్రం అందించిన వారిలో ఉన్నారు.
Next Story






