- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబుదాబి సెంటర్ కేటాయింపు వివాదం.. వాస్తవాలను వెల్లడిస్తూ ఎన్‌టీఏ (NTA) కీలక వివరణ!
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వివాదం.. అభ్యర్థి స్వయంగా మార్చుకున్నారని ఆధారాలతో స్పష్టం చేసిన ఎన్‌టీఏ (NTA)!

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ రీ ఎగ్జామ్ జరగనున్న క్రమంలో ఏ చిన్న తప్పిదం జరిగినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలో ఓ అభ్యర్థికి అడ్మిట్ కార్డుపై అబుదాబి పేరుతో సెంటర్ రావడంతో సోషల్ మీడియాలో ఎన్‌టీఏపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. దీంతో అప్రమత్తం అయిన ఎన్‌టీఏ అబుదాబి సెంటర్ కేటాయింపు వివాదంపై వాస్తవాలను వెల్లడిస్తూ కీలక వివరణ ఇచ్చింది. అభ్యర్థి ప్రొఫైల్‌లో జరిగిన మార్పుల వెనుక సాంకేతిక లోపాలు ఏవీ లేవని, అభ్యర్థి స్వయంగా చేసిన మార్పుల వల్లే అలా జరిగిందని వెల్లడించింది.
ఎన్‌టీఏ వెల్లడించిన వివరాల ప్రకారం.. అభ్యర్థి అప్లికేషన్ కరెక్షన్ విండో (Correction Window) ఓపెన్ ఉన్న సమయంలో, సదరు అభ్యర్థికి సంబంధించిన రిజిస్టర్డ్ లాగిన్ ఐడీ, క్రెడెన్షియల్స్ ద్వారానే పరీక్షా కేంద్రాన్ని ‘అబుదాబి’గా మార్చడం జరిగింది. వెబ్-యాక్టివిటీ రికార్డులను పరిశీలించగా.. ఒకే సింగిల్ యూజర్ ఐపీ అడ్రస్ ద్వారా ఈ మార్పులు జరిగినట్లు స్పష్టమైంది. మొత్తం మూడు సందర్భాలలో అభ్యర్థి లాగిన్ వివరాలను ఉపయోగించి సెంటర్‌ను అబుదాబిగా మార్చారని, అలాగే రెండు సార్లు అబుదాబి సెంటర్‌ను ప్రివ్యూ (Preview) చేసి చూసుకున్నట్లు ఎన్‌టీఏ రికార్డులలో నమోదైందని వివరణ ఇచ్చింది.
చివరి నిమిషంలో అభ్యర్థికి ఎన్‌టీఏ సాయం
అభ్యర్థి స్వయంగా అబుదాబి సెంటర్‌ను ఎంచుకున్నప్పటికీ.. పరీక్షకు కేవలం 48 గంటల ముందు, అంటే జూన్ 19 సాయంత్రం ఎన్‌టీఏ అధికారులకు ఒక అనధికారిక అభ్యర్థన అందింది. పరీక్షా కేంద్రాన్ని తిరిగి నాగ్‌పూర్‌కు మార్చాలని అభ్యర్థి కుటుంబ సభ్యులు కోరారు. చివరి నిమిషంలో వచ్చిన విజ్ఞప్తి అయినప్పటికీ, విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎన్‌టీఏ సిబ్బంది తక్షణమే స్పందించారు. జూన్ 19 సాయంత్రమే సదరు అభ్యర్థి తండ్రిని ఫోన్ ద్వారా సంప్రదించి, ఫార్మల్ ప్రాసెస్‌ను పూర్తి చేయడంలో సహాయం అందించి, పరీక్షా కేంద్రాన్ని నాగ్‌పూర్‌కు మారుస్తూ తగిన చర్యలు తీసుకున్నట్లు ఎన్‌టీఏ స్పష్టం చేసింది.






