- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సేవే లక్ష్యంగా సర్పంచ్ ముందడుగు.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆటో సౌకర్యం
by Batti.Sumithra |
ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామం పరిధిలోని వడ్డెర కాలనీ, తాండా వాసుల విద్యార్థుల కోసం గ్రామ సర్పంచ్ తోగర్ల భూషణ్ స్వయంగా తన సొంత ఖర్చులతో ఆటో వాహనాన్ని ఏర్పాటు చేశారు.

X
దిశ, ఆలూర్ : ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామం పరిధిలోని వడ్డెర కాలనీ, తాండా వాసుల విద్యార్థుల కోసం గ్రామ సర్పంచ్ తోగర్ల భూషణ్ స్వయంగా తన సొంత ఖర్చులతో ఆటో వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా తోగర్ల భూషణ్ మాట్లాడుతూ ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులను సురక్షితంగా, సమయానికి స్కూల్‌కు చేరవేసే విధంగా ఈ ఆటో సేవను ప్రారంభించామని, విద్యార్థుల విద్యాభివృద్ధి దృష్ట్యా రవాణా సమస్యలు ఎదురుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. అదేవిధంగా గ్రామంలోని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం అందరి బాధ్యత అని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు వడ్డెర కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






