- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ జంటకు పోలీస్ స్టేషన్‌లో వివాహం..
by Kodari Anjali |
ఓ ప్రేమ జంటకు పోలీసుల సమక్షంలో శనివారం వివాహం జరిగింది.

X
దిశ, కొణిజర్ల: ఓ ప్రేమ జంటకు పోలీసుల సమక్షంలో శనివారం వివాహం జరిగింది. కొణిజర్ల మండలం అనంతారం గ్రామానికి చెందిన నాయిని ప్రసన్న అనే యువతి ఖమ్మం నగరానికి చెందిన బక్క అన్వేష్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై గత సంవత్సరకాలంగా ప్రేమించుకున్నారు. విషయం యువకుడి కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. పెళ్ళికి నిరాకరించారు. దీంతో యువకుడు ప్రసన్నను పెళ్లి చేసుకునేందుకు అనేష్ నిరాకరించటంతో యువతి కుటుంబ సభ్యులు కొణిజర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై సూరజ్ యువకుడికి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించి, యువతిని వివాహం చేసుకునేందుకు ఒప్పించారు. దీంతో పెద్దల సమక్షంలో ప్రేమ జంటకు దండలు మార్పించి వివాహం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సూరజ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






