- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ అమ్మ పేరుతో ఓ మొక్కను నాటండి..పర్యావరణం కాపాడండి
పేరుతో మొక్కలు నాటి, పర్యావరణం కాపాడండి అంటూ మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు.

దిశ, కొత్తకోట: తల్లుల పేరుతో మొక్కలు నాటి, పర్యావరణం కాపాడండి అంటూ మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలో శనివారం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం క్లాస్ రూమ్ లోకి వెళ్లి స్కూల్లోని మౌలిక వసతులు వారి సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. గతంలో మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో నే కులమతాలు, భేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా చదువుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి, డోకూర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, కొండ ప్రశాంత్ రెడ్డి, కొమ్ము భరత్ భూషణ్, దాబా శీను, వనపర్తి శ్రీనివాస్ రెడ్డి, గాయత్రి సత్యం సాగర్, నారాయణమ్మ వెంకట్ రెడ్డి, నరేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.






