జవాన్ కుటుంబ సభ్యులకు రూ.50 వేలు ఆర్థిక సహయం..

by Kodari Anjali |

జవాన్‌గా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గాంధీలాల్ కుటుంబ సభ్యులకు మున్సిపాలిటీ చైర్ పర్సన్ రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

జవాన్ కుటుంబ సభ్యులకు రూ.50 వేలు ఆర్థిక సహయం..
X

దిశ, వైరా: వైరా మున్సిపాలిటీలో జవాన్ గా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గాంధీలాల్ కుటుంబ సభ్యులకు శనివారం వైరా మున్సిపాలిటీ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జవాన్ గాంధీలాల్ కుటుంబం అత్యంత నిరుపేద స్థితిలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న చైర్ పర్సన్ చంద్రకళ, కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కాపా మురళీకృష్ణ, కౌన్సిలర్ల అందరితో కలిసి ఆర్థిక సహయం చేసేందుకు ముందుకు వచ్చారు. అదేవిధంగా శనివారం నిర్వహించిన దశ దినకర్మలో కాపా మురళీకృష్ణ, ఉండ్రు శ్యాంబాబు పాల్గొని గాంధీలాల్ చిత్రపటానికి పూల మాలవేసి ఘన నివాళులు అర్పించారు.

Next Story