- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది ఆత్మహత్య
by Vemula.Srinu Prasad |
విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో విషాదం చోటు చేసుకుంది. నేవీ క్యాంటీన్ సమీపంలో సెక్యూరిటీ ఉద్యోగి మోర్ పరాగ్ సురేశ్ ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన సురేశ్ విధుల్లో ఉండగానే తన సర్వీస్ గన్‌తో కాల్చుకున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం ఎయిర్‌పోర్టు(Visakhapatnam Airport)లో విషాదం(Tragedy) చోటు చేసుకుంది. నేవీ క్యాంటీన్ సమీపంలో సెక్యూరిటీ ఉద్యోగి మోర్ పరాగ్ సురేశ్(Security employee More Parag Suresh) ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు.మహారాష్ట్రకు చెందిన సురేశ్ విధుల్లో ఉండగానే తన సర్వీస్ గన్‌తో కాల్చుకున్నారు. దీంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. అయితే తుపాకీ శబ్దం విన్న సహచర సిబ్బంది ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎయిర్‌పోర్టు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సురేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సురేశ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సురేశ్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఘటన ఎయిర్ పోర్టులో ఒక్కసారిగా కలకలం రేపింది.
Next Story






