స్కిన్ కేర్ క్రీమ్స్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్‌పై కేంద్రం నిషేధం

by Naga Rani Yarlagadda |

దేశంలో ప్రజా ఆరోగ్యాన్ని రక్షించేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

స్కిన్ కేర్ క్రీమ్స్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్‌పై కేంద్రం నిషేధం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ప్రజా ఆరోగ్యాన్ని రక్షించేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మానవ వినియోగం కోసం తయారు చేసే 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ మందుల తయారీ, అమ్మకాలు, పంపిణీ, సరఫరాపై తక్షణమే అమల్లోకి వచ్చేలా కేంద్రం నిషేధం విధించింది. ఈ ఔషధాల వల్ల ట్రీట్మెంట్ పరంగా ఎలాంటి ప్రయోజనాలు లేవని, వీటి వల్ల జరిగే నష్టంతో పోలిస్తే.. ప్రయోజనం ఏమాత్రం లేదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రోగుల భద్రతను పెంపొందించడం, వైద్యశాస్త్రపరంగా ధృవీకరించిన సమర్థవంతమైన మందులు మాత్రమే అందుబాటులో ఉండేలా చూడటం కోసం.. ఈ కఠినమైన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ.. ఈ మందులను తయారు చేసే మిశ్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించింది. పలు మందుల తయారీల్లో వాడే డ్రగ్ కాంబినేషన్ తప్పుగా, హానికరంగా ఉన్నట్లు తేలడంతో.. డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940లోని సెక్షన్ 26A కింద కేంద్రప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రం బ్యాన్ చేసిన వాటిలో స్కిన్ కేర్ క్రీమ్స్, పెయిన్ కిల్లర్స్, కడుపునొప్పి మాత్రలు, కొన్నిరకాల యాంటిబయాటిక్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా నిషేధించిన మందుల్లో అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్‌తో ఎథోహెప్టాజైన్; డిసైక్లోమైన్, పారాసిటమాల్, క్లిడినియం బ్రోమైడ్ : గ్లిక్లాజైడ్ తో కోమియం పికోలినేట్, పారాసిటమాల్ కాంబినేషన్ తో లిగ్నోకైన్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు అమోక్సిసిలిన్, సెర్రాటియోపెప్టిడేస్ మరియు లాక్టోబాసిల్లస్ స్పోరోజెనెస్ వంటి యాంటీబయాటిక్ మిశ్రమాలను కూడా ప్రభుత్వం నిషేధించింది. అలాగే విటమిన్ ఈ, జోజోబా ఆయిల్, టీ ట్రీ ఆయిల్, అలోవెరా వంటి పదార్ధాలతో కూడిన కొన్ని స్కిన్ కేర్ క్రీమ్స్ ను బ్యాన్డ్ లిస్టులోకి చేర్చారు. దేశవ్యాప్తంగా ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని పేర్కొంటూ రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లు, ఎన్ఫోర్స్ మెంట్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Next Story