- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిషన్ భగీరథ నీటి ట్యాంక్ కింద మురుగు నీరు.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రం పరిధిలోని పాంపాడ్ గ్రామంలో 40 వేల లీటర్ల మిషన్ భగీరథ నీటి ట్యాంక్ కింద గత కొన్ని ఏళ్లుగా మురుగు డ్రైనేజీ నీళ్లు నిల్వ ఉండటంతో ప్రజలు తాగే నీటిలో కలుషితం అవుతున్నాయి.

దిశ, రాయికోడ్: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రం పరిధిలోని పాంపాడ్ గ్రామంలో 40 వేల లీటర్ల మిషన్ భగీరథ నీటి ట్యాంక్ కింద గత కొన్ని ఏళ్లుగా మురుగు డ్రైనేజీ నీళ్లు నిల్వ ఉండటంతో ప్రజలు తాగే నీటిలో కలుషితం అవుతున్నాయి. ట్యాంక్ కింద మురుగు నిలిచి ఉండటంతో ఎస్సీ, బీసీ కాలనీ వాసులకు సరఫరా అయ్యే నీరు కలుషితం అవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగుతో కలిసిన నీటిని తాగలేక, వాడుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అపరిశుభ్ర నీరు తాగడం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు.
అధికారులకు చెప్పినా పట్టింపు లేదు..
ఈ విషయాన్ని పలుమార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండల అధికారులకు సమాచారం ఇచ్చినా, గ్రామ సభ సమావేశం సందర్భంగా పర్యవేక్షించి సమస్యను గాలికి వదిలేశారని వాపోతున్నారు. ట్యాంక్ కింద ఉన్న మురుగును తొలగించి, తాగునీటిని శుద్ధి చేసి సరఫరా చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. లేదంటే రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.






