- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లామర్ షోతో అందరి చూపులు తనవైపు తిప్పుకున్న ప్రణీత
హాట్ పోజులతో కుర్ర హీరోయిన్లకు గుబులు పుట్టిస్తున్న ప్రణీత

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ ప్రణీత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఆమె ఎక్కువగా కనిపించకపోయినా, ఒకప్పుడు వరుస అవకాశాలతో తన కెరీర్‌ను విజయవంతంగా ముందుకు సాగించింది. సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్దగా పలకరించకపోయినా, సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటోంది.
ఇక సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ప్రణీత తన గ్లామర్‌తో ఎక్కువగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోల్లో ఆమె బ్లాక్ కలర్ జాకెట్ ధరించి స్టైలిష్ లుక్‌లో కనిపించింది. జాకెట్‌ను ఓపెన్ స్టైల్‌లో ధరించి హాట్ పోజులతో కెమెరాకు ఫోజులిచ్చింది.
అలాగే తన కురులను ముఖంపై పడేలా చేసుకొని, చేతులు ముడుచుకుని ఎంతో కాన్ఫిడెంట్‌గా నిలబడింది. ఒక వేలికి ఉంగరం ధరించి మరింత ఆకర్షణీయమైన లుక్‌తో అభిమానులను అలరించింది. మొత్తంగా ఈ ఫోటోల్లో ప్రణీత స్టైలిష్ మరియు గ్లామరస్ అవతారంలో కనిపించడంతో పాటు, ఆమె డ్రెస్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






