హైదరాబాద్ రోడ్డుకు ట్రంప్ పేరు.. సీఐటీయూ నిరసన

by velandi.Saikiran |

ట్రంప్ పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ ఎస్సారెస్పీ కెనాల్ వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

హైదరాబాద్ రోడ్డుకు ట్రంప్ పేరు.. సీఐటీయూ నిరసన
X

దిశ, సుల్తానాబాద్: హైదరాబాద్ ఫైనాన్స్ డిస్టిక్ నానక్ రామ్ గూడలోని అమెరికా కాన్సులేట్ వద్ద రోడ్డుకు ట్రంప్ పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ ఎస్సారెస్పీ కెనాల్ వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవల్లి ముత్యంరావు మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదం, అకారణమైన యుద్ధాలను సృష్టించి లక్షల మందిని పొట్ట‌న పెట్టుకుందని మండిప‌డ్డారు. ట్రంప్ చ‌ర్య‌ల వ‌ల్లే, చ‌మురు ధ‌ర‌లు పెరిగాయ‌న్నారు.

అలాంటి ట్రంప్ ను పొగడడం, ఆయ‌న‌ పేరును పెట్టడం దుర్మ‌ర్గామంటూ సీరియ‌స్ అయ్యారు. ఆ పేరును మార్చాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రైస్ మిల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు తాండ్ర అంజయ్య, రైస్ మిల్ మస్తాల సంఘ అధ్యక్షులు, మాతంగి రాజమల్లు, ఉపాధ్యక్షుడు బండారి తిరుపతి, బ్రహ్మచారి, రాజయ్య, ఓదెలు, ప్రసాద్, రమేష్, మల్లేష్, శీను, సతీష్, శ్రీకాంత్, రవీందర్, శివ, రాజు, వెంకటేష్, మహేందర్, రవి, సది, శివప్రసాద్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story