- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బర్త్ డే స్పెషల్: ‘మెగా ప్రిన్సెస్ క్లింకారా’ ఫేస్ రివీల్ చేసిన ఉపాసన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల గారాల పట్టి 'క్లింకారా కొణిదెల' మూడో పుట్టినరోజు వేడుకలు నేడు (జూన్ 20) ఘనంగా జరుగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల గారాల పట్టి 'క్లింకారా కొణిదెల' మూడో పుట్టినరోజు వేడుకలు నేడు (జూన్ 20) ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రత్యేకమైన రోజున మెగా అభిమానులకు చెర్రీ దంపతులు ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. గత మూడేళ్లుగా ఎంతో రహస్యంగా ఉంచుతూ వచ్చిన తమ ముద్దుల కూతురు ముఖాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు. క్లింకారా బర్త్ డే సందర్భంగా ఉపాసన కొణిదెల తన అఫీషియల్ సోషల్ మీడియా వేదికగా ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఫొటోను పంచుకున్నారు. ఈ ఫొటోలో రామ్ చరణ్, ఉపాసనలతో పాటు క్లింకారా చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. "మా లిటిల్ ప్రిన్సెస్‌కు హ్యాపీ బర్త్ డే" అంటూ ఉపాసన శుభాకాంక్షలు తెలిపారు.
పండగ చేసుకుంటున్న మెగా అభిమానులు..
ఇప్పటివరకు చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి మెగా హీరోలు క్లింకారాతో దిగిన ఫొటోలు బయటకు వచ్చినప్పటికీ.. ఎక్కడా కూడా పాప ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే నేడు నేరుగా ఫేస్ రివీల్ చేస్తూ ఫొటోస్ షేర్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. "అచ్చం అమ్మ(ఉపాసన)లాగే ఉంది" అంటూ నెటిజన్లు, అభిమానులు క్లింకారా ఫొటోను రీ-ట్వీట్లు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా 'మెగా ప్రిన్సెస్' క్లీంకారాకు పెద్ద ఎత్తునే బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.






