- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాక్టర్ నుంచి పడి వ్యక్తి మృతి
by velandi.Saikiran |
ఎండపల్లి గ్రామానికి చెందిన తోట్ల మధుకర్ (26 ) అనే యువకుడు శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి పడి మృతి చెందాడని ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.

X
దిశ, వెల్గటూర్ : ఎండపల్లి గ్రామానికి చెందిన తోట్ల మధుకర్ (26 ) అనే యువకుడు శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి పడి మృతి చెందాడని ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. తన వ్యవసాయ పొలానికి వెళ్లే క్రమంలో ట్రాక్టర్ నొగలు మీద నిల్చొని ఉన్నాడు మధుకర్. అయితే కొమురయ్య ట్రాక్టర్ ను అతి వేగంగా నడపడంతో మధుకర్ కింద పడ్డాడు. దీంతో గాయపడిన అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్, మధుకర్ చనిపోయినట్లు నిర్ధారించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.
Next Story






