- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు కుటుంబానికి కేటీఆర్ రూ. 3 లక్షల ఆర్థిక సహాయం..
వ్యవసాయ వ్యతిరేఖ విధానాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని హత్యలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

దిశ, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పొన్న గ్రామానికి చెందిన పాండురంగ్ అను రైతు ఆత్మహత్యకు పాల్పడి ఐదు రోజుల క్రితం కళ్ళంలోనే విషం తాగి మృతి చెందారు. ఈ సంఘటన తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ శనివారం మధ్యాహ్నం పొన్న గ్రామానికి చేరుకొని ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించి రూపాయలు మూడు లక్షలు ఆర్థిక సహాయం అందజేశారు. అంతకు ముందుగా రైతు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. రైతు ఆత్మహత్యకు గల కారణాలను రైతు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా రైతుకు లక్షన్నర అప్పు ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విషయంలో తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానాలు వల్లే రాష్ట్రంలోని రైతులు మృతి చెందుతున్నారని, మృతి చెందిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆడుకోవాలని డిమాండ్ చేశారు. రైతు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన రీతిలో ప్రతి పంటకు రూపాయలు 500బోనస్ ఇవ్వకుండా, ప్రవైట్ మార్కెట్ లో రూపాయలు 2000కు ధాన్యం అమ్ముకునే దయనియా పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనివచ్చింది అన్నారు. దేశంలోనే రైతును రాజుగా చేసింది కేసీఆర్ అని అన్నారు. గతంలో రైతు ఆత్మహత్యలో ఆదిలాబాద్, మహారాష్ట్ర ముందు వరుసలో ఉండేవాన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్ కొవ లక్ష్మి, మాజీ మంత్రి రామన్న, తదితరులు పాల్గొన్నారు.






