- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బట్టలు ఆరేస్తున్న కోడలికి విద్యుత్ షాక్.. కాపాడబోయి అత్తమామలు మృతి
బట్టలు ఆరేస్తున్న కోడలికి విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయితే ఆమెను చూసిన అత్తమామలు ఎలాగైనా సరే కాపాడాలని ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో వారిని విధి వంచింది. ..

దిశ, వెబ్ డెస్క్: బట్టలు ఆరేస్తున్న కోడలికి విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయితే ఆమెను చూసిన అత్తమామలు ఎలాగైనా సరే కాపాడాలని ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో వారిని విధి వంచింది. కోడలి పరిస్థితి విషమంగా ఉండగా దంపతులిద్దరూ మృతి చెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సైదపురం మండలం రాజుపాలెం గ్రామంలో జరిగింది. ఉదయాన్ని బట్టలు ఉతికిన కోడలు ఇంటి పైకప్పుపై బట్టలు ఆరేందుకు వెళ్లింది.
ప్రమాదవశాత్తు విద్యాత్ వైర్లు తగిలి
అయితే ప్రమాదవశాత్తు ఆమెకు విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఆమెను కాపాడేందుకు పరిగెత్తుకుంటూ వచ్చిన అత్తమామలు సునీత, రవి కరెంట్ షాక్‌కు గురయ్యారు. సునీత, రవి అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొడలి పరిస్థితి మాత్రం విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సునీత, రవి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బట్టలు ఆరవేసే క్రమంలో ఇంతటి ప్రాణనష్టం జరగడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.






