అవినీతిరహిత అభివృద్ధికి సహకరిస్తాం: బీఆర్ఎస్ కౌన్సిలర్లు

by Kodari Anjali |

అభివృద్ధిలో అన్ని వార్డులకు సముచిత స్థానం కేటాయించాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు.

అవినీతిరహిత అభివృద్ధికి సహకరిస్తాం: బీఆర్ఎస్ కౌన్సిలర్లు
X

దిశ, వైరా: వైరా మున్సిపాలిటీలో అవినీతి రహిత అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని, ఆ మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. వైరాలోని బీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు కట్టా స్వరూప రాణి, మాదినేని సునీత, తిరుపతి శివకుమారి, చిలక చిన్న కోటయ్య, దొంతెబోయిన వెంకటేశ్వరరావు, కిన్నెర కృష్ణ, నల్లమోతు శైలజ మాట్లాడారు. వైరా మున్సిపాలిటీ అభివృద్ధిలో అన్ని వార్డులకు సముచిత స్థానం కేటాయించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ రెండో సాధారణ సమావేశంలో ఒకేసారి 95 అంశాలను ప్రవేశపెట్టడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్ పర్సన్ కాపా చంద్రకళ భర్త మురళీకృష్ణ కౌన్సిల్ సభ్యుల పట్ల అభ్యంతరకరంగా మాట్లాడటం శోచనీయమన్నారు.

శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్..

ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే భవిష్యత్తులో జరిగే సమావేశాలను సైతం అడ్డుకుంటామని పేర్కొన్నారు. కౌన్సిల్ సమావేశానికి విలేకరులకు అనుమతి లేదని అడ్డుకున్న కమీషనర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల భర్తలను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన పలు అంశాలు అవినీతిమయంగా ఉన్నాయని, వాటిని వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్ల భర్తలను సమావేశంలోకి అనుమతించిన కమీషనర్ రామచంద్రరావు పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు వనమా విశ్వేశ్వరరావు, కట్టా కృష్ణార్జున రావు, మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు, నాయకులు మద్దెల రవి, మాదినేని దుర్గాప్రసాద్, అప్పం సురేష్, మరికంటి శివ, ఏదునూరి శ్రీనివాసరావు, తిరుపతి శ్రీను, కారుకొండ బోస్, మిట్టపల్లి కిరణ్, నూకల వాసు, నల్లమోతు సురేష్, కట్టా నాగేశ్వరరావు, వాంకుడోత్ వీరన్న, వేముల శివకృష్ణ, బానోత్ శివ తదితరులు పాల్గొన్నారు.

Next Story