రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్ దే: మధిర నియోజకవర్గం ఇంచార్జ్

by Kodari Anjali |

పంటల కొనుగోలు విషయంలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాలి జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ చైర్మన్, మధిర నియోజకవర్గం ఇంచార్జ్ అన్నారు.

రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్ దే: మధిర నియోజకవర్గం ఇంచార్జ్
X

దిశ, మధిర: రైతును రాజును చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కుతుందని, రైతు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ఆయన అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేశారని జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ చైర్మన్ మధిర నియోజకవర్గం ఇంచార్జ్ లింగాల కమల్ రాజు అన్నారు. మధిర బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన ప్రెస్ మీట్‌లో లింగాల కమల్ రాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పంటల కొనుగోలు విషయంలో ఇటీవల క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని విమర్శించారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన ప్రతి పంటను కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా రైతులకు భరోసా కల్పించే విధానాలు అమలు చేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా రైతులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. కేసీఆర్ 11 సార్లు రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు చేశారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మూడుసార్లు మాత్రమే అది ఎకరానికి మాత్రమే వేశారని ఆయన విమర్శించారు.

ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు..

అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి వచ్చి రెండున్నర సంస్థలైన ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. గతంలో 33 రకాల సన్న వడ్లకు ఇచ్చే బోనస్‌ను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు రకాలకే కుదించి రైతు కంట కన్నీరు తెప్పిస్తున్నదని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సాగుకు సంసిద్ధమైన రైతన్నలు ఇప్పటికే వరి నాడుమలు తయారు చేశారని, ఆ 33 రకాలలో ఏడు రకాలు లేకపోతే రైతుల పోసిన నారుమడూల్లు నష్టపోవాల్సిందేనా. అధికారం కోసం రైతులు అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అన్ని రకాల సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తాము అని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక.. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు ఉంది కాంగ్రెస్ వ్యవహార శైలి.. రేవంత్ ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తాము అని గొప్పలకు పోయి అన్నదాతలకు తిప్పలు తెచ్చి పెట్టింది. బోనస్ ఇస్తుంది అనే ఆశతో రైతులు సన్నాలనే పండిస్తున్నారు కానీ ప్రస్తుతం ఏడు రకాలకు మాత్రమే కుదించి రైతులను మోసం చేస్తుంది అని కాంగ్రెస్ డిఎన్ఏ లోనే మోసం ఉన్నదని విమర్శించారు. రైతులకు ఏదో చేస్తున్నాము అని చెప్పే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుండి ప్రతి విషయంలో మోసం చేస్తున్నది.

ఇకనైనా అబద్ధపు మాటలు కట్టిపెట్టి..

అధికారంలోకి రాకముందు లగేత్తండి పరిగెత్తండి అని చెప్పి రెండు లక్షల రుణం అని మాయ మాటలు చెప్పి అనేకమందికి ఇవ్వకుండా ఎగ్గొట్టింది. రైతు భరోసా ఎకరానికి 15000 అని మోసం చేసింది.కాంగ్రెస్ అలాగే ఎరువుల కోసం కళ్ళు కాయలు కాసేలా చేసి లైన్లో నిలబెట్టి అది కూడా ఇవ్వటం చేతగాక ఎటువంటి ప్రణాళిక లేక యాప్ ని తీసుకువచ్చి రైతుల కంట కన్నీరు పెట్టిస్తుంది. ఇప్పుడు సన్న వడ్లకు బోనస్ ఇవ్వటం చేతగాక కేంద్ర ప్రభుత్వంపై సాకులు చెబుతూ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తమ చేతకానితనాన్ని బయట పెట్టుకుంటున్నారు అని ఘాటుగా విమర్శించినారు. ఇకనైనా అబద్ధపు మాటలు కట్టిపెట్టి రైతులకు సన్న వడ్లకు 33 రకాల సన్న వడ్లకు గతంలో ఇస్తాము అని చెప్పిన 500 రూపాయల చొప్పున ప్రతి బస్తాకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేసారు.కేవలం ఖమ్మం జిల్లాలోనే ఈ వానాకాలం సీజన్లో 3.20 లక్షల ఎకరాలలో సన్నాల వరి సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచన వేశారని ప్రతి గింజను రైతుల వద్ద నుండి కొనాలని లేని యెడల రైతులతో ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తాము అని హెచ్చరించినారు.

సమావేశంలో పాల్గొన్నవారు...

రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వము మనుగడ కూడా సాధించలేదని అది తెలుసుకొని రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మధిర మేజర్ సొసైటీ అధ్యక్షులు బిక్కి కృష్ణ ప్రసాద్, మధిర మున్సిపాలిటీ బీఆర్ఎస్ వార్డ్ కౌన్సిలర్ వైవిఅప్పారావు, రాయపట్నం సర్పంచి కంచం గోపి, టిఆర్ఎస్ నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్ రెడ్డి, పల్లపోతు వెంకటేశ్వరరావు, వంకాయలపాటి నాగేశ్వరావు, మొండితోక జయాకర్, రంగిశెట్టి కోటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ ధీరావత్ మాధవి, బీఆర్ఎస్ నాయకులు ఆళ్ల నాగబాబు, ఆయిలూరి ఉమామహేశ్వర్ రెడ్డి, కటికల సత్యనారాయణ రెడ్డి, పరిశ శ్రీనివాసరావు, చీదిరాల రాంబాబు, బొగ్గుల వీరారెడ్డి, పల్లపాటి కోటేశ్వరరావు, రాయుడి భద్రయ్య, మొరుబోయిన ప్రసాద్, పరిటాల పూర్ణచంద్రరావు నాగులవంచ రామారావు, కోట కోటేశ్వరరావు ఆరుద్ర కొండలరావు, నీలం రమేష్, అబ్బురి రామన్, జల్లా ప్రవీణ్, దిల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Next Story