మృణాల్-ధనుష్ ప్రేమాయణంలో ఊహించని ట్విస్ట్!

by Mallepaka Hamsa |

ధనుష్-మృణాల్ ప్రేమాయణంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారట.

మృణాల్-ధనుష్ ప్రేమాయణంలో ఊహించని ట్విస్ట్!
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించనప్పటికీ.. పలు కార్యక్రమాల్లో సన్నిహితంగా కనిపించడంతో పుకార్లకు బలం చేకూరినట్లు అయింది. గతంలో మృణాల్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్-2’ ప్రీమియర్ సందర్భంగా ధనుష్ వెళ్లడంతో వీరిద్దరు ప్రేమించుకుంటున్నారనే పుకార్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అంతటితో ఆగకుండా.. ధనుష్ నటించిన ‘తేరే ఇష్క్ మైన్’ మూవీ ర్యాప్ ఆప్ పార్టీలోనూ మృణాల్ కనిపించడం గమనార్హం. అంతేకాకుండా ధనుష్ సోదరీమణులను మృణాల్ ఫాలో అవుతుండటంతో.. ప్రేమ వార్తలు నిజమే అని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే గతంలో ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ వీరిద్దరు అధికారికంగా రియాక్ట్ కాకపోవడంతో వీరి ప్రేమను సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ అయిపోయింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక, విజయ్ కూడా అలా సైలెంట్‌గా ప్రేమాయణం నడిపి.. ఇటీవల పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరి బాటలోనే ధనుష్, మృణాల్ కూడా పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ షాకింగ్ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ధనుష్-మృణాల్ ప్రేమాయణంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరు బ్రేకప్‌తో విడిపోవాలని నిర్ణయించుకున్నారట. సినీ ఈ నిర్ణయానికి గల కారణాలు తెలియనప్పటికీ.. విడిపోయేందుకు మొగ్గు చూపుతున్నట్లు టాక్. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సెలబ్రిటీ కపుల్స్ కామన్‌గా చేసే పని వీరు చేస్తున్నారని అంతా చర్చించుకుంటున్నారు. మనస్పర్థలు రావడం వల్లనే అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story