- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ‘సర్’ ప్రక్రియపై BIG అప్‌డేట్.. కొత్త ఓటర్ల నమోదుపై క్లారిటీ
తెలంగాణలో ‘సర్’ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ‘సర్’ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్త ఓటరు నమోదుకు అవకాశం లేదని వార్తలు వస్తున్నాయని, అవన్నీ అసత్యమని అన్నారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సమగ్రంగా, పారదర్శకంగా రూపొందించేందుకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ -2026 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు, బూత్ లెవల్ ఏజెంట్లకు ఇప్పటికే పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చేపట్టిన ‘సర్’పై వివరాలను వెల్లడించారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 25 నుంచి బీఎల్వీలు తమ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని వెల్లడించారు. జులై 25వ తేదీలోపు ఎన్యుమరేషన్ సమర్పించాలని, కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును అదే ఫారంలో నమోదు చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చారు. చాలా చోట్ల 80 శాతం మ్యాపింగ్ పూర్తి చేశామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పత్రాలను కూడా అనుమతిస్తామని, 2002లో అనుసంధానమైన వారికి ఇతర పత్రాలు అవసరం లేదని స్పష్టం చేశారు. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురించే వరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా నియమించుకుంటున్నట్లు తెలిపారు. బీఎల్‌వోలు తీసుకొచ్చే ఫామ్‌లను ముసాయిదాలో పొందుపరుస్తున్నామని వెల్లడించారు. రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పామన్నారు.






