- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్లలు దాటిన ప్రేమ.. పెళ్లితో ఒక్కటైన జంట
ఖండాలు దాటిన ఆంధ్రా కుర్రాడి ప్రేమ.. పెళ్లితో సక్సెస్ అయింది. ప్రేమకు కులం, మతం, జాతి, ప్రాంతం ఏవీ అడ్డుకావు, అడ్డురావని ఈ జంట ప్రూవ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కులమతాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోని క్రమంలో.. కొందరు ప్రేమికులకు ఎడబాటే దిక్కవుతోంది. ఈ క్రమంలో.. ఖండాలు దాటిన ఆంధ్రా కుర్రాడి ప్రేమ.. పెళ్లితో సక్సెస్ అయింది. ప్రేమకు కులం, మతం, జాతి, ప్రాంతం ఏవీ అడ్డుకావు, అడ్డురావని ఈ జంట ప్రూవ్ చేశారు. పల్నాడు జిల్లా దేవచవరానికి చెందిన యాంపాటి శ్రీనివాసరావు, బంగారమ్మ దంపతుల కుమారుడు వెంకటేశ్వర్లు కొన్నేళ్ల క్రితం ఉన్నత విద్యకోసం జర్మనీకి వెళ్లారు. అప్పటికే రష్యా నుంచి వచ్చి జర్మనీలో స్థిరపడిన కుటుంబానికి చెందిన పలీనా కూడా వెంకటేశ్వర్లు చేరిన కాలేజీలోనే చేరింది. అక్కడే ఇద్దరి మధ్య మొదలైన పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. వెంకటేశ్వర్లుకు యాపిల్ సంస్థలో జాబ్ కూడా వచ్చింది. లైఫ్ లో మంచి ఉద్యోగంతో సెటిలవ్వడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం ఇరువురి ఇళ్లలో పెద్దలకు చెప్పగా.. పెద్దల సమక్షంలో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో నరసరావుపేటలోని ఏ1 కన్వెన్షన్ హాల్లో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు పలీనా తరపున రష్యా, జర్మనీల నుంచి బంధువులు కూడా హాజరయ్యారు.






