- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్నాడు జిల్లాలో సీఎం పర్యటన.. అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్స్ పంపిణీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపం లింగంగుంట్లలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి.. అంగన్వాడీ ఆయాలకు ఇండక్షన్ స్టవ్స్ పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు.. గానుక ఎక్కి వేరుశనగ, కొబ్బరినూనెను ఉత్పత్తిని పరిశీలించారు. అనంతరం అక్కడి రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడిన తర్వాత.. ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ విత్తనాలను నాటారు.
భార్యకు బర్త్ డే విషెస్
తన భార్య భువనేశ్వరికి సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంచి భార్యగా, తల్లిగా, వ్యాపారవేత్తగా రాణిస్తూనే.. తమ జీవితాల్లో వెలుగునింపావంటూ.. భువనేశ్వరిపై ప్రశంసలు కురిపించారు. ఆమె సౌమ్యం, దయాగుణం ఎందరికో స్ఫూర్తినిచ్చిందన్నారు. ఇంత అద్భుతమైన వ్యక్తిని నా జీవిత భాగస్వామిగా పొందానని, ఆమెతో జీవిత ప్రయాణాన్ని పంచుకుంటున్నందుకు రుణపడి ఉంటానన్నారు.






