- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ కుర్చీలో అనధికార వ్యక్తులు
కంగ్టి మండలం చప్టా (కె) గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం చోటుచేసుకున్న ఘటన గ్రామంతో పాటు మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దిశ, కంగ్టి : కంగ్టి మండలం చప్టా (కె) గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం చోటుచేసుకున్న ఘటన గ్రామంతో పాటు మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరో ప్రజాప్రతినిధి కుమార్తె జన్మదిన వేడుకలను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన అనంతరం సర్పంచ్‌కు కేటాయించిన కుర్చీలో కొందరు వ్యక్తులు కూర్చుని ఫోటోలు దిగిన విషయం స్థానికంగా చర్చకు దారితీసింది. ప్రజల ఓట్లతో ఎన్నికైన సర్పంచ్ పదవికి ప్రత్యేక గౌరవం ఉంటుందని, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌కు కేటాయించిన అధికారిక కుర్చీలో ఇతరులు కూర్చోవడం సముచితం కాదని పలువురు గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాప్రతినిధుల స్థానాలకు తగిన గౌరవం, మర్యాద కల్పించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో గ్రామస్తులు స్పందిస్తున్నారు. ఈ విషయం పై సంబంధిత అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితుల పై స్పష్టత ఇవ్వాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.






