భూ కబ్జాలు ఎవరు చేశారో తేల్చుకుందాం రండి: బొల్లా బ్రహ్మనాయుడు సవాల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-20 11:01:33  IST  )

హైదరాబాద్ గండిపేట భూముల కబ్జా కేసులో వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బెయిల్‌పై విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై వినుకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు చేసిన విమర్శలు, ప్రచారాలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. .

భూ కబ్జాలు ఎవరు చేశారో తేల్చుకుందాం రండి: బొల్లా బ్రహ్మనాయుడు సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ గండిపేట భూముల కబ్జా కేసులో వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బెయిల్‌పై విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై వినుకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు చేసిన విమర్శలు, ప్రచారాలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీనితో పాటు సవాల్ కూడా విసిరారు. గండిపేట భూముల కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. భూకబ్జాలు ఎవరు చేశారో తేల్చుకుందాం రండి అని ఛాలెంజ్ చేశారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మల్లికార్జునరావు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అవసరమైతే లోకేశ్‌ను కూడా తోడు తెచ్చుకోండని అని వ్యాఖ్యానించారు.

పార్టీలు మారే వ్యక్తి ఆయన

పదవులు ఇస్తామంటే చాలు వెంటనే పార్టీలు మారిపోయే వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు అని బొల్లా విమర్శించారు. వినుకొండ వస్తే తన నిజాయితీ ఏంటో తెలుస్తుందని ఆహ్వానించారు. దేశ రాజధాని ఢిల్లీ వెళ్తే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల బాగోతం ఏంటో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. తనపై దుష్ప్రచారం చేసిన వెన్నుపోటు పార్టీకి రాష్ట్ర ప్రజలే బుద్ధి చెబుతారని బొల్లా బ్రహ్మానాయుడు హెచ్చరించారు.

Next Story