నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు

by velandi.Saikiran |

నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి.

నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు
X

దిశ, కమలాపూర్: నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి. వంగపల్లి గ్రామంలో కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి ప్రజలకు చేరువయ్యే విధంగా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. గ్రామ సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఏసీపీ, ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీల వద్దకు స్వయంగా వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను అందజేసి వారి సమస్యలను ఆప్యాయంగా అడిగి తెలుసుకోవడం అందరినీ ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజు పాలకవర్గం ఏసీపీ ని సంప్రదాయ గొంగడితో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ భూముల వద్ద చిన్నచిన్న వివాదాలను పెద్ద గొడవలుగా మార్చుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవద్దని సూచించారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే 100 నంబర్‌కు డయల్ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపడం ప్రమాదకరమని, అలాంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

Next Story