భారత్‌లో ప్రతి ఇద్దరిలో ఒకరికి అక్రమసంబంధం.. సర్వేలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

by Ajay Maddhiboyina |

ఈ మ‌ధ్య కాలంలో దేశంలో అక్ర‌మ‌సంబంధాలు ఆందోళ‌న‌క‌లిగించే స్థాయిలో పెరిగిపోతున్నాయి. పురుషులు, మ‌హిళ‌లు అనే తేడా లేకుండా ఇల్లీగ‌ల్ రిలేష‌న్ షిప్స్ లో ఒక‌రితో మ‌రొక‌రు పోటీ పడుతున్నారు.

భారత్‌లో ప్రతి ఇద్దరిలో ఒకరికి అక్రమసంబంధం.. సర్వేలో బయటపడ్డ షాకింగ్ నిజాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఈ మ‌ధ్య కాలంలో దేశంలో అక్ర‌మ‌సంబంధాలు ఆందోళ‌న‌క‌లిగించే స్థాయిలో పెరిగిపోతున్నాయి. పురుషులు, మ‌హిళ‌లు అనే తేడా లేకుండా ఇల్లీగ‌ల్ రిలేష‌న్ షిప్స్ లో ఒక‌రితో మ‌రొక‌రు పోటీ పడుతున్నారు. తాజాగా అక్ర‌మ‌సంబంధాల‌పై ఓ స‌ర్వే సంస్థ షాకింగ్ నిజాల‌ను బ‌య‌ట‌పెట్టింది. ఈ స‌ర్వే ప్ర‌కారం ప్ర‌తి ఇద్ద‌రు భార‌తీయుల్లో ఒక‌రు త‌మ భాగ‌స్వాముల‌ను మోసం చేసిన‌ట్టు అంగీక‌రించ‌గా, పెళ్లైన 55 శాతం మంది త‌మ సంబంధంలో ఏదో ఒక స‌మ‌యంలో మోసం చేసిన‌ట్టు ఒప్పుకున్నారు.

ఈ స‌ర్వే ఆధారంగా భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య న‌మ్మ‌కం త‌గ్గిపోతుందని, ఎమోష‌న్స్ కంట్రోల్ చేసుకోవ‌డంలో విఫ‌లం అవుతున్నార‌ని తేలింది. సోష‌ల్ మీడియా ప్ర‌భావం, పనిఒత్తిడి, ఇద్ద‌రి మ‌ధ్య స‌రిగ్గా మాట‌లు లేకపోవ‌డం, సీక్రెట్ ఆన్ లైన్ స్నేహాలు లాంటి అంశాలు నేటి వివాహ బంధాల‌ను దెబ్బ‌తీస్తున్నాయ‌ని తేలింది. ప్ర‌స్తుతం ఈ స‌ర్వే వైర‌ల్ అవ్వ‌డంతో వివాహ బంధాలు, జీవితాంతం క‌లిసి ఉండ‌టంపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. కొంద‌రు మారుతున్న ఆధునిక జీవన‌శైలిలో ఇది కామ‌న్ అని భావిస్తుంటే... మ‌రికొంద‌రు ఫ్యూచ‌ర్ లో ఇది పూర్తిగా వివాహ వ్య‌వ‌స్థ‌నే దెబ్బ తీస్తుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు.

Next Story