- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
23న పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు
ప్రభుత్వ పాఠశాల విద్య నిర్వీర్యం అవుతుందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ అన్నారు.

దిశ, ధర్మారం: ప్రభుత్వ పాఠశాల విద్య నిర్వీర్యం అవుతుందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ అన్నారు. ఏబీవీపీ ధర్మారం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కన్వీనర్ బండి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేతకు కుట్ర చేస్తూ... ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీకి కొమ్ముకాస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో జూన్ 23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్ కు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తున్నాడని, అందుకే రేషనలైజేషన్ పేరుతో 23000 ల పాఠశాలలను మూసేందుకు కంకణం కట్టుకున్నాడని ఆగ్రహించారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ధర్మారం నగర కార్యదర్శి ఆకుల వంశీ, నాయకులు రఘు, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.






