హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. రాగల గంటలో ఈ ప్రాంతాలకు అలెర్ట్

by Malleboina Mahesh |   (  Updated:2026-06-20 11:13:21  IST  )

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం.. రాగల గంటలో నాచారం, మల్కాజ్‌గిరి, తార్నాక ప్రాంతాలకు అలెర్ట్.

హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. రాగల గంటలో ఈ ప్రాంతాలకు అలెర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉదయం నుంచి భారీ ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న నగరవాసులకు తెలంగాణ వెదర్‌మ్యాన్ (Telangana Weatherman) బిగ్ అలర్ట్ రాజీ చేశారు. హైదరాబాద్‌ మహానగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు (Intense Thunderstorms) పడుతున్నాయి. మరో గంటలో నగరం తూర్పు, ఈశాన్య ప్రాంతాలైన బోడుప్పల్, పీర్జాదిగూడ, నారపల్లి, ఘట్‌కేసర్, బండ్లగూడ, తట్టిఅన్నారం, హయాత్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉరుముల మోతతో కూడిన కుండపోత వర్షం కురుస్తోంది. ఈ ప్రభావం రాగల ఒక గంటలో నాచారం, మల్లాపూర్, మల్కాజ్‌గిరి, దమ్మాయిగూడ, నాగారం, చార్లపల్లి, కాప్రా, నాగోల్, తార్నాక, వాటి పరిసర ప్రాంతాలకు విస్తరించనుందని వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

అలాగే రాత్రి వేళల్లో మరిన్ని తీవ్రమైన తుఫాను మేఘాలు (Storms) నగరంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణ ప్రణాళికలను తదనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని యాదాద్రి-భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట జిల్లాలో రాగల రెండు గంటల్లో విస్తృతంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు ప్రారంభమై, సాయంత్రం వేళకు అవి మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరికలు జారీ చేశారు.

Next Story