- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లి కాబోతున్న సమంత..వైరల్ అవుతున్న బేబి బంప్ వీడియో
స్టార్ నటి సమంత తల్లి కాబోతున్నారని, కొత్త సినిమా ప్రమోషన్లలో ఆమె బేబి బంప్ తో కనిపించారని వీడియో వైరల్ అవుతుంది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటి అయిన సమంత (Samantha) ఇటీవల మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి హిట్ సాధించారు. పాజిటివ్ టాక్ తో సినిమా దూసుకు పోతుండటంతో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలో సమంతకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆమె గర్భవతి అయ్యారంటూ నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక చిన్న వీడియో క్లిప్‌లో సమంత లుక్‌ను నిశితంగా గమనించిన కొందరు సోషల్ మీడియా వినియోగదారులు, ఆమెకు బేబీ బంప్ (Baby bump) కనిపిస్తోందని కామెంట్లు చేయడం ప్రారంభించారు. దీంతో సమంత తల్లి కాబోతుందా అనే చర్చ అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఒక్కసారిగా ఆసక్తిని రేకెత్తించింది.
అయితే ఈ వైరల్ వార్తలపై నటి సమంత గానీ, ఆమెకు సంబంధించిన అధికారిక ప్రతినిధులు గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం ఆ వీడియోలోని కొన్ని విజువల్స్ ఆధారంగా నెటిజన్లు మాత్రమే ఈ రకమైన అంచనాలకు వస్తున్నట్లు తెలుస్తుంది. సమంత వైపు నుంచి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేనందున, ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మిగిలింది. ఏది ఏమైనప్పటికి ఎమ్ జరిగినా కూడా సమంత మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.






