- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Inflation: వర్షాభావం, ఎల్‌నినోతో ద్రవ్యోల్బణం పెరిగే ఛాన్స్
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు వెలువడటం, ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే సంకేతాలు కనిపించడం ఇందుకు ప్రధాన కారణాలని ఆయన చెప్పారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఆహార ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం కనిపిస్తోందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరించారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు వెలువడటం, ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే సంకేతాలు కనిపించడం ఇందుకు ప్రధాన కారణాలని ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతం రబీ పంట దిగుబడులు రావడం, ప్రభుత్వ వద్ద తగిన ఆహార నిల్వలు ఉండటం వల్ల తక్షణం పెద్దగా ఒత్తిడి కనిపించడం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యం 6 శాతం స్థాయికి చేరే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ పరిస్థితుల్లో కూడా ఆర్‌బీఐ తొందరపడి విధాన మార్పులు చేయకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వర్షాకాలం ఎలా ఉంటుందో, అంతర్జాతీయ ఇంధన ధరలు ఏ దిశగా వెళ్తాయో, ప్రపంచ భౌగోళిక ఉద్రిక్తతలు ఎంతకాలం కొనసాగుతాయో ఇంకా స్పష్టత లేదని గవర్నర్ చెప్పారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణంలో కనిపిస్తున్న పెరుగుదలకు ప్రధానంగా ఆహారం, ఇంధన ధరలే కారణమని, కోర్ ఇన్‌ఫ్లేషన్ మాత్రం అదుపులోనే ఉందని ఆయన వివరించారు. ఇదే కారణంతో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఎంపీసీ, వృద్ధి అంచనాలను తగ్గిస్తూ, ద్రవ్యోల్బణ అంచనాలను పెంచింది. పరిస్థితులు ఎలా మారుతాయో గమనించిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవాలని ఆర్‌బీఐ భావిస్తోంది.






