- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇతరులు చేసిన బాధాకరమైన పనులను మర్చిపోవాలనుకుంటున్నా.. శోభిత సెన్సేషనల్ కామెంట్స్
నిన్నటి వరకు తన జీవితంలో జరిగిన సంఘటనలన్నింటినీ పూర్తిగా మర్చిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

దిశ, సినిమా: అక్కినేని వారి కోడలు,నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ వివాహం జరిగినప్పటి నుంచి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇటీవల ‘చీకటిలో’ అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేశారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘వెట్టువం’లో శోభిత కూడా నటించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుడగా.. ఈ ప్రాజెక్ట్ కాకుండా కొన్ని కథలను కూడా శోభిత వింటున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత ధూళిపాళ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ఆమెను ప్రశ్నిస్తూ.. జీవితంలో మీరు ఏ విషయాన్ని మర్చిపోవాలని అనుకుంటున్నారు అని అడిగారు. దానికి శోభిత స్పందిస్తూ.. నిన్నటి వరకు తన జీవితంలో జరిగిన సంఘటనలన్నింటినీ పూర్తిగా మర్చిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
సాధారణంగా మతిమరుపును ఒక జబ్బుగా భావిస్తారని, కానీ కొన్నిసార్లు మతిమరుపు అనేది మనిషికి చాలా మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇతరులు మనకు చేసిన బాధాకరమైన పనులను, చేదు జ్ఞాపకాలను మనం మర్చిపోయినప్పుడే జీవితంలో ముందుకు సాగడం సాధ్యమవుతుందని వివరించారు. పాత జ్ఞాపకాలలోనే ఎప్పుడూ కూరుకుపోకుండా, భవిష్యత్తు గురించి ఆలోచించడమే నేటి అవసరమని ఆమె చెప్పుకొచ్చారు. శోభిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె ఎవరి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. శోభిత అసలు ఎవరిని ఉద్దేశించి ఈ బాధాకరమైన పనుల గురించి మాట్లాడారు అని ప్రశ్నిస్తున్నారు.






