- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధనుష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... 'ఓం' కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్
ధనుష్ 'ఓం' చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా 'ఓం' అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'అమరన్' ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా, వండర్‌బార్ ఫిలింస్ మరియు RTake స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఓం' చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.
ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న అనేక భారీ చిత్రాలు రెండు భాగాల ఫార్మాట్‌ను అనుసరిస్తున్న నేపథ్యంలో, 'ఓం' మూవీ కూడా అదే బాటలో నడవనున్నట్లు తెలుస్తోంది. ధనుష్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా భావిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు వస్తున్న వార్తలతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






