ఊరికి వెళ్లిన వేళ చోరీ..!

by Batti.Sumithra |

గుంటిపల్లి శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు, నగదును అపహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఊరికి వెళ్లిన వేళ చోరీ..!
X

దిశ, చందంపేట : గుంటిపల్లి శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు, నగదును అపహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండ మండలం కొర్రతండాకు చెందిన కొర్ర సురేష్ (తండ్రి బలరాం), అతని భార్య పద్మ, లోకసాని పద్మారెడ్డి ఫామ్‌హౌస్‌లో వాచ్‌మెన్‌లుగా పనిచేస్తున్నారు. ఈ నెల 17వ తేదీ రాత్రి నుంచి 19వ తేదీ రాత్రి 9 గంటల మధ్యకాలంలో వారు తమ స్వగ్రామానికి వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దుండగులు ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు.

ఇంట్లో భద్రపరిచిన నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.83 వేల నగదును అపహరించి పరారయ్యారు. ఈ ఘటన పై బాధితుడు కొర్ర సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందుకున్న డిండి సీఐ బీసన్న సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించింది. చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందంపేట ఎస్సై లోకేష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story