- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీలంక ఆటగాళ్లతో గొడవ..క్లారిటీ ఇచ్చిన వైభవ్
భారత్, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా చిన్న పాటి గొడవ చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ట్రై సిరీస్ లో భాగంగా సోమవారం భారత్, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా చిన్న పాటి గొడవ చోటు చేసుకుంది. సూపర్ ఓవర్ లో శ్రీలంక ఏ, ఏడు పరుగుల తేడాతో గెలిచిన ఈ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల ప్లేయర్లు గొడవపడ్డారు. అంపైరింగ్ నిర్ణయాలు భారత్ కు వ్యతిరేకంగా రావడంతో తిలక్ వర్మ సారధ్యంలోని ప్లేయర్లు మైదానాన్ని వీడెందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ సందర్భంగా వైభవ్ కాస్త రెచ్చిపోయాడు.
ఓ శ్రీలంక ప్లేయర్ తో వాగ్వాదానికి దిగాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఈ వివాదంపై తాజాగా వైభవ్ క్లారిటీ ఇచ్చారు. తాను కావాలని గొడవ పడలేదని వెల్లడించారు. శ్రీలంక ప్లేయర్లే తనను తిట్టడం మొదలు పెట్టారని.. అది భరించలేక తాను రియాక్ట్ అయినట్లు క్లారిటీ ఇచ్చారు. పక్క ప్లాన్ తో తనను టార్గెట్ చేసి బూతులు తిట్టినట్లు అనిపించిందని, అందుకే ఆవేశానికి లోనైనట్లు వివరించారు. ఇందులో తమ తప్పేం లేదన్నారు వైభవ్.






