అనుమతులు.. ఎన్నో అనుమానాలు..!

by velandi.Saikiran |

శంషాబాద్ మండల పరిధిలోని నానాజీపూర్‌లో ఏర్పా టు చేసిన పల్లవి ఇంటర్నేషనల్ స్కూ ల్‌పై వివాదాలు ముదురుతున్నా యి.

అనుమతులు.. ఎన్నో అనుమానాలు..!
X

దిశ, రంగారెడ్డి: శంషాబాద్ మండల పరిధిలోని నానాజీపూర్‌లో ఏర్పా టు చేసిన పల్లవి ఇంటర్నేషనల్ స్కూ ల్‌పై వివాదాలు ముదురుతున్నా యి. పాఠశాల నిర్వహణకు అవసరమైన అనుమతులు, ధ్రువపత్రాల వి షయంలో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ ఆరోపణలు వె ల్లువెత్తుతున్నాయి. పాఠశాల యాజ మాన్యం మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించి న ప్రజావాణిలో భూముల పరిరక్షణ సమితి నాయకులు, పలువురు ఫిర్యా దు లు చేశారు. పాఠశాల అనుమతుల ప్రక్రియలో అధికారుల పాత్రపై కూ డా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ధ్వజమెత్తారు. స్థా నిక విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకు లు, తల్లిదండ్రులు పాఠశాల వ్యవహా రాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న యాజమాన్యంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాఠ శాల అనుమతుల కోసం సమర్పించిన ప త్రాలు, అనుమతుల జారీ ప్రక్రియ మొత్తం సమగ్ర దర్యాప్తుకు గురి చేయాలని కోరుతున్నారు.

నిబంధనలపై నీళ్లు..

పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ విష యంలో ఈ మొత్తం ప్రక్రియను పక్కనపెట్టి కేవలం 31 రోజుల్లోనే అనుమతి జారీ చేశారని ఆరోపించా రు. సాధారణంగా నెలల తరబడి సాగే ప్రక్రియ ఒక్క నెలలో పూర్తవ డం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇటీవల పాఠశాల యాజమాన్యం పత్రాలను ఆన్లైన్లో దరఖాస్తు చేయగా.. గత నెల 31న ట్రాన్స్‌ఫర్ అయిన జిల్లా విద్యాధికా రి సుశీందర్రావు చివరి పని రోజున పల్లవి ఇంటర్నేషనల్ స్కూలుకు అ నుమతి మంజూరు చేయడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.

పత్రాలన్నీ నిజమేనా..?

పాఠశాల అనుమతుల కోసం సమర్పించిన పత్రాల ప్రామాణికతపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాఫిక్ అనుమతి, అగ్నిమాపక శాఖ ధ్రువీకరణ, నిర్మాణ భద్ర తా ప్రమాణాలు, పారిశుధ్య ధ్రువపత్రాలు వంటి కీలక అంశాల్లో వా స్తవ పరిస్థితులు, సమర్పించిన పత్రా ల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్రా లను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అ ధికారులు.. బాధ్యతలను విస్మరించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అధికారుల పాత్రపై ప్రశ్నలు

ఈ వ్యవహారంపై ఎంఈవో కార్యాల యం, డీఈవో కార్యాలయం, కలెక్టర్ ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు లు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎ లాంటి చర్యలు తీసుకోలేదని టీఎస్‌ ఎస్‌వో నేతలు ఆరోపించారు. పాఠ శాల యాజమాన్యానికి అనుకూలం గా వ్యవహరిస్తూ అధికారులు నిబంధనలను గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటి నుం చి ఆయా శాఖల అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది.

అనుమతుల ప్రక్రియలో భారీ అక్రమాలు..?

రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం టీఎస్‌ఎస్‌వో రాష్ట్ర అధికార ప్రతినిధి రమేశ్ మీడియాతో మాట్లాడారు. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అనుమతు ల జారీ ప్రక్రియలో అనేక నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని ఆరో పించారు. నిబంధనల ప్రకారం ట్రాఫిక్ ఎన్‌వోసీ, ఫైర్ సేఫ్టీ సర్టిఫికే ట్, నిర్మాణ భద్రత-నాణ్యత ధ్రువీకరణ పత్రం, శానిటరీ సర్టిఫికెట్‌తో పాటు గ్రామ పంచాయతీ నుంచి భవన నిర్మాణం, పాఠశాల నిర్వహణకు సంబంధించిన అనుమతులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇంకా పాఠశాల భవన నిర్మాణం పూర్తికాకముందే అడ్డగోలుగా ప్రా రంభించేందుకు సంబంధిత యాజ మాన్యం ఏర్పాట్లు చేసుకోవడం గమనార్హం. సంబంధించిన పత్రాలన్నింటినీ ఆన్‌లైన్‌లో సమర్పించిన అనంతరం మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి నివేదికను జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)కు పం పాల్సి ఉంటుందని వివరించారు. అనంతరం సంబంధిత అధికారులు, ప్రాంతీయ సంయుక్త విద్యాశాఖాధికారి (ఆర్‌జేడీ) స్థాయిలో సమగ్ర పరిశీలన జరిగిన తర్వాత మాత్రమే అనుమతి మంజూరు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

సీబీఎస్సీ, కేంబ్రిడ్జి పేరుతో మోసమా..?

పాఠశాల యాజమాన్యం సీబీఎ స్సీ, కేంబ్రిడ్జ్ కరికులం పేర్లను ప్ర చారం చేస్తూ తల్లిదండ్రులను ఆకర్షిస్తోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఆయా విద్యా విధానాలకు సంబంధించి న పూర్తి స్థాయి అనుమతులు, గు ర్తింపులు ఉన్నాయా? అనే విష యాన్ని ప్రభుత్వం స్పష్టం చేయా లని తల్లిదండ్రులు కోరుతున్నా రు. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి అక్రమాలు రు జువైతే సంబంధిత అధికారులపై, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాం డ్ చేస్తున్నారు.

Next Story