ఈ నెల 26న స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే

by velandi.Saikiran |

విద్యార్థులకు బిగ్ అలెర్ట్. ఈ నెల 26వ తేదీన స్కూళ్లకు హాలిడే ఉండనుంది.

ఈ నెల 26న స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ అలెర్ట్. ఈ నెల 26వ తేదీన స్కూళ్లకు హాలిడే ఉండనుంది. మొహ‌ర్రం సెలవును ఈ నెల 26వ తేదీకి మార్చింది ఏపీ సర్కార్. ముందుగా ప్రకటించిన సాధారణ సెలవుల జాబితాలో జూన్ 25వ తేదీన ప్రభుత్వ హాలిడే ఉంది. అయితే మొహ‌ర్రం 26వ తేదీన జరగనుందని వక్ఫ్ బోర్డు సీఈవో... కూటమి సర్కార్ కు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన ప్రభుత్వం.. సెలవు ను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో 26వ తేదీన ఏపీలో స్కూల్స్ కు హాలిడే ఉండనుంది. అదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర ప్రైవేట్ సంస్థలకు కూడా హాలిడేను 26వ తేదీకి మార్చుతూ జీవో కూడా విడుదల చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది సర్కార్. కాగా వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో మొన్న జూన్ 12వ తేదీన ఏపీలో పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. ఇక‌ తెలంగాణలో మాత్రం జూన్ 15వ తేదీ నుంచి స్కూల్స్ రీ-ఓపెన్ అయ్యాయి.

Next Story