బుచ్చిబాబుకు నో...ఆ ద‌ర్శ‌కుడితో మ‌హేష్ బాబు కొత్త సినిమా ?

by velandi.Saikiran |   (  Updated:2026-06-15 22:16:12  IST  )

రాజ‌మౌళితో సినిమా పూర్తికాగానే, మ‌హేష్ బాబు కొత్త సినిమాకు లైన్ క్లియ‌ర్ చేసుకుంటున్నారు.

బుచ్చిబాబుకు నో...ఆ ద‌ర్శ‌కుడితో మ‌హేష్ బాబు కొత్త సినిమా ?
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఇలాంటి క్రమంలో మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ చేసినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మహేష్ బాబు సినిమా దాదాపు ఫైనల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం స్పిరిట్ షూటింగ్ లో సందీప్ రెడ్డి బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఫినిష్ కాగానే... మహేష్ తో సినిమాను పట్టాలెక్కించనున్నాడట. ఆ సమయానికి వారణాసి షూటింగ్ కూడా పూర్తి అవుతుందని అంటున్నారు. మహేష్ బాబు, సందీప్ రెడ్డి సినిమాకు ఏషియన్ సినిమా సునీల్ నారంగ్ నిర్మాతగా ఉండనున్నట్లు టాక్ నడుస్తోంది. కాగా.. బుచ్చిబాబుతో మహేష్ బాబు సినిమా ఉంటుందని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఇక ఈ మూవీ ప్రచారంగానే ఉండనున్నట్లు టాక్ నడుస్తోంది.

Next Story