- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోక్సో కేసులో బండి భగీరథ్‍కు బెయిల్
పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు మల్కాజిగిరి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భగీరథ్‍కు బెయిల్ మంజూరైంది. నెల రోజులకు పైగా జైల్లో ఉన్న భగీరథ్‍కు తాజాగా మల్కాజిగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అరణ్య ఫాంహౌస్‌లో సీన్ రీకన్‌స్ట్రక్షన్:
కాగా, ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో బండి బగీరథ్‍పై గత మే 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‍లో పోక్సో కేసు నమోదైంది. నాటకీయ పరిణామాల మధ్య ఈ కేసు విచారణాధికారి కూకట్ పల్లి డీసీసీ రితిరాజ్ ఆదేశాలతో 5 బృందాలుగా రంగంలోకి దిగిన పోలీసులు మే 16న భగీరథ్‍ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించారు. ఈ కేసు దర్యాప్తులో మరిన్ని కీలక ఆధారాలు సేకరించేందుకు పోలీసులు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఆశ్రయించగా మల్కాజిగిరి కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ను కస్టడీకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు చర్లపల్లి జైలు నుంచి తమ అదుపులోకి తీసుకుని మొయినాబాద్‍లోని అరణ్య ఫామ్ హౌస్‍కు భగీరథ్‍ను తీసుకువెళ్లారు. అక్కడ సీన్ రీ కన్ స్ట్రక్చన్ నిర్వహించారు. ఈక్రమంలో భగీరథ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‍పై విచారణ జరిపిన మల్కాజిగిరి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.






