- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండేళ్లు ధైర్యంగా బ్రతకండి, మళ్లీ కేసీఆర్ వస్తాడు: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామంలో పర్యటించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు నుగూరే పాండురంగ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామంలో పర్యటించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు నుగూరే పాండురంగ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. రైతు కుటుంబానికి ధైర్యం చెప్పండని కేసీఆర్ తమను ఇక్కడికి పంపించారని అన్నారు. రెండేళ్లు దయచేసి ధైర్యంగా బ్రతకండి, మళ్లీ కేసీఆర్ వచ్చి మిమ్మల్ని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటామని చెప్పమ్మన్నాడని తెలిపారు. పంట కొనలేదని రైతు విషం తాగి పడిపోతే ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు పరిస్థితి ఇదేనని అన్నారు. పాండురంగ్ కుటుంబానికి కనీసం రుణమాఫీ కాలేదు, రైతుబంధు కూడా పడటం లేదని చెప్పారు. చనిపోయిన ప్రతీ రైతుకి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కుటుంబంలో చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. ధాన్యం కొనక, లంచం సిస్టం పెట్టి, కనీసం మార్కెట్ యార్డులో నీళ్లు కూడా లేవని విమర్శించారు. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. నిజంగానే ధాన్యం కొనడంలో ప్రభుత్వం రికార్డ్ సృష్టించి ఉంటే పాండురంగ్ అనే రైతు ఎందుకు చనిపోయాడని ప్రశ్నించారు. కరోనా సమయంలో కూడా తాము 8500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని, ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మవద్దని అన్నారు. కావాలంటే కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్లి అడగాలని సూచించారు.






