- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెడ్‌రూమ్‌లోనే కాదు.. బ్యాంకు లాకర్‌లోనూ నోట్ల కట్టలు.. నరహరి కేసులో విస్తుపోయే విషయాలు
అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన ల్యాండ్స్ డీడీ నరహరి బ్యాంకు లాకర్‌లో భారీగా నగదును ఏసీబీ అధికారులు గుర్తింాచారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి అక్రమార్జన బాగోతం తవ్వేకొద్ద బయటపడుతోంది. ఇటీవల ఆయన నివాసంలో ఏసీబీ జరిపిన సోదాల్లో భారీగా నగదు, బంగారం, ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకోగా తాజాగా ఆయన బ్యాంకు లాకర్‍లో కళ్లు బైర్లు కమ్మే షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఇవాళ నరహరి బ్యాంకు లాకర్‍లను ఓపెన్ చేసి చూసిన అధికారులు షాక్ కు గురయ్యారు. అతడి లాకర్లో కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలను దర్శనం ఇచ్చాయి. ఈ నగదు విలువ రూ. కోటిన్నర ఉంటుందని అధికారులు తెలిపారు.
పడకగదిలో కోట్లాది రూపాయలు:
నరహరి నివాసంలో ఏసీబీ జరిపిన దాడుల్లో రూ. 1.54 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా రూ. 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండిని సీజ్ చేశారు. అలాగే బ్యాంకు ఖాతాల్లో రూ. 2.29 కోట్లు గుర్తించారు. వీటితో పాటు కోట్లాడి రూపాయల విలువ చేసి స్థిర, చరాస్తులను గుర్తించారు. ఈ సోదాల్లో ఏకంగా ఆయన బెడ్ రూమ్ లో బెడ్ కింద కోట్ల కుప్పనే పోగేసుకోవడం కలకలం రేపింది. తాజాగా బ్యాంకు లాకర్లలోనూ కరెన్సీ కట్టలు వెలుగు చూడటంతో నరసహరి అవినీతి దందా ఏ రేంజ్ లో సాగిందో అంటూ అంతా చర్చించుకుంటున్నారు.






