ఆర్మూర్‌లో వింత.. రెండు తలలతో జన్మించిన దూడ!

by Jakkula.Mamatha |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటార్ మోర్ ఏరియాలో అరుదైన వెలుగుచూసింది.

ఆర్మూర్‌లో వింత.. రెండు తలలతో జన్మించిన దూడ!
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటార్ మోర్ ఏరియాలోని మున్సిపల్ 6వ వార్డులో గేదెలను పెంచుకుంటూ గంగారాం యాదవ్, అతని కుమారుడు గణేష్ యాదవ్ జీవనోపాధి పొందుతున్నారు. ఇదివరకు ఈ తండ్రి కొడుకులు కోటార్ మూర్ ఏరియాలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పశువులను సైతం మేపుతూ ఉపాధి పొందారు. శనివారం ఈ తండ్రి కొడుకులు పెంచుకుంటూ ఉపాధి పొందుతున్న ఒక గేదె రెండు తలలతో కూడిన దూడను జన్మించింది.

ఇలా ఓ దూడ రెండు తలాలతో జన్మించడం వల్ల ఆ తండ్రి కొడుకులు స్థానిక పశువైద్యాధికారి రాజేశ్వర్ ను సంప్రదించి వారు పెంచుకుంటున్న గేదెను జన్మించిన దూడను సందర్శించి పరిశీలించాలని కోరారు. దీంతో ఆ పశు వైద్యుడు రాజేశ్వర్ ఆయన సర్వీస్ లో ఇలా ఓ దూడ రెండు తలలతో జన్మించడానికి చూడటం ఇదే తొలిసారి అని అన్నారు. మూడు కాళ్లు ఇంకా వేరే అవయవాలు ఎక్కువగా దూడలు జన్మించాయి కానీ ఇలా రెండు తలలతో దూడ జన్మించడానికి ఇదే తొలిసారి అని పశు వైద్యుడు రాజేశ్వర్ తెలిపారు. రెండు తలలతో దూడ జన్మించిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక ప్రజలు ఆ దూడను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. రెండు తలలతో జన్మించిన కూడా ఉదయం 6 గంటల కంటే ముందు జన్మించిన 7:30 గంటల వరకు ఆరోగ్యంగానే ఉందని గంగారామ్ యాదవ్, గణేష్ యాదవ్ లు తెలిపారు.

Next Story