క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌..ఒకే రోజు మూడు మ్యాచ్ లు

by velandi.Saikiran |

క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌..బుధవారం రోజున‌ మూడు మ్యాచ్ లు జ‌రుగ‌నున్నాయి.

క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌..ఒకే రోజు మూడు మ్యాచ్ లు
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. జూన్ 17వ తేదీన ఏకంగా మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. ట్రై సిరీస్ లో భాగంగా ఉదయం 10 గంటలకు భారత్ A, ఆఫ్ఘనిస్తాన్ A జట్ల మధ్య వన్డే ఉంటుంది. ఈ ట్రై సిరీస్ లో భారత్ A, ఆఫ్ఘనిస్తాన్ A జట్లతో పాటు లంక A టీమ్ కూడా పాల్గొంటోంది. ఇదే బుధ‌వారం రోజున భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మధ్యాహ్నం 1:30 గంటలకు రెండో వన్డే జరగనుంది.

అటు ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా భారత మహిళల టీమ్ నెదల్యాండ్స్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఒకే రోజున వరుసగా భారత జట్లు మూడు మ్యాచులు ఆడనున్నాయి. ఈ లెక్క‌న బుధ‌వారం 12 గంటల పాటు క్రికెట్ ఫ్యాన్స్ కు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించనున్నారు భార‌త క్రికెట‌ర్లు. అయితే,ఈ మూడు మ్యాచ్ ల్లో ఎక్కువ‌గా భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జ‌రిగే వ‌న్డే తిల‌కించే ఛాన్స్ ఉంటుంది. రోహిత్ శ‌ర్మ ఈ సిరీస్ ఆడుతోన్న నేప‌థ్యంలో ఫ్యాన్స్ ఎగ‌బ‌డి చూడ‌నున్నారు.

Next Story