- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పీరియడ్’శాలా గురించి మీకు తెలుసా?
పీరియడ్ వస్తే కనీసం అక్క, చెల్లితో కూడా చెప్పుకోవద్దు.. ఇంటికి దూరంగా బయట ఓ మూలన పడి ఉండాల్సిందే.. ఎన్ని రోజులు రుతుక్రమం కొనసాగుతుందో అన్ని రోజులు స్నానం చేయకూడదు..

దిశ, ఫీచర్స్ : పీరియడ్ వస్తే కనీసం అక్క, చెల్లితో కూడా చెప్పుకోవద్దు.. ఇంటికి దూరంగా బయట ఓ మూలన పడి ఉండాల్సిందే.. ఎన్ని రోజులు రుతుక్రమం కొనసాగుతుందో అన్ని రోజులు స్నానం చేయకూడదు.. అలా చేస్తే బ్లీడింగ్ ఎక్కువవుతుంది.. కాబట్టి ఆ దుర్వాసనను భరించాలి.. దీని గురించి మరో వ్యక్తితో కూడా చర్చించొద్దు.. ఇలాంటి పరిస్థితుల నుంచి కొన్ని వేల మందిని బయటకు తీసుకొచ్చింది సుర్భి కుమారి. జర్నలిజాన్ని కాదనుకుని.. గ్రౌండ్‌లోకి దిగింది. ఎంతో మందికి అవగాహన కల్పించడమే కాదు ఉపాధి కల్పించి ఆర్థికంగా ఎదిగేలా చేసింది. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న మూఢనమ్మకాలకు బ్రేక్ చేయగలిగింది.
నాకేమైంది?
బీహార్ రాష్ట్రంలోని గయాలో జన్మించిన సుర్భి పెరిగిన వాతావరణంలో అమ్మాయిలకు కఠిన నిబంధనలు ఉండేవి. ఓ అమ్మాయి అయినప్పుడు బౌండరీస్ పాటించాల్సిందే. సూర్యాస్తమయం అయ్యాక బయటకు వెళ్లకూడదు.. అన్నింటికి అడ్జస్ట్ కావాలి.. మాట బయటకు రాకూడదు.. పెద్దలను ప్రశ్నించకూడదు.. మెన్‌స్ట్రువేషన్‌ను చాలా సీక్రెట్‌గా ఉంచాలి.. కనీసం ఎదుగుతున్న పిల్లలకు కూడా అసలు పీరియడ్స్ అంటే ఏంటో కూడా వివరించరు. దీని కారణంగానే ఏడో తరగతిలో స్కూల్‌లోనే ఫస్ట్ పీరియడ్ ఫేస్ చేసిన ఆమెకు.. తన స్కర్ట్‌కు రక్తపు మరకలు అంటాయంటే.. తనకు ఏదో పెద్ద అనారోగ్యమే వచ్చిందని అనుకుంది. దీని గురించి ఎలాంటి గైడెన్స్, తన బాడీ గురించి కాన్ఫిడెన్స్ లేకుండానే అడోల్సెన్స్ గ్రూప్‌లోకి ఎంటర్ అయింది.
ఇక్కడే మార్పు..
చదువుల్లో టాపర్ అయిన ఆమె ఇంటర్‌లో మ్యాథ్స్ గ్రూప్ తీసుకుని.. కోచింగ్ కోసం కోటాకు చేరింది. కానీ ఫెయిల్ అయింది. ఆ పల్లెటూరులో ఓ అమ్మాయి ఫెయిల్ కావడమంటే.. తన ఇంటి పరువు దిగజార్చడమే అన్న మాట. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఆమెకు తల్లిదండ్రులు మరొక ఆప్షన్ ఇచ్చారు. తనకు నచ్చింది చేయమని సూచించారు. దీంతో రైటింగ్, జనాల సమస్యలు, ముఖ్యంగా ఫీమేల్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా చర్చించే ఆమెకు జర్నలిజం బెస్ట్ ఆప్షన్ అనుకుంది. ఇందులో భాగంగానే ఓ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు తనలాంటి అమ్మాయిలు ఎంతో మంది పీరియడ్ టైమ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించింది.
ఇక చదువు అయిపోయాక.. SumArth కోఫౌండర్ ప్రభాత్‌ను పెళ్లి చేసుకుంది. చిన్న, సన్నకారు రైతులకు సపోర్ట్ చేసే ఈ ఆర్గనైజేషన్‌లో 2019లో తను కూడా చేరింది. 2014లో ఏర్పడిన సంస్థ అప్పటికే 30వేల మంది రైతులతో పని చేస్తుంది. వీరిలో 60 శాతం మంది స్త్రీలే. అయితే మహిళలతో ఎంగేజ్ అవుతున్నప్పుడు తను ఓ విషయాన్ని గమనించింది. మహిళలు ప్రతి నెలా కొద్ది రోజులు పనిలోకి రావడం లేదని.. ఇందుకు కారణం మెన్‌స్ట్రువల్ టైమ్‌ను హ్యాండిల్ చేయలేకపోవడమే అని తెలుసుకుంది. అప్పుడే తను.. మెన్‌స్ట్రువేషన్ అనేది సపరేట్ ఇష్యూ కాదని.. లేబర్, ఇన్‌కమ్, సెల్ఫ్ వర్త్‌కు సంబంధించిందని.. రియలైజ్ అయింది. SumArth కంపెనీ కి్ంద ‘సబల’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఊర్లు తిరుగుతూ.. చేనులో.. కల్లాల్లో పని చేస్తున్న మహిళలకు దీని గురించి వివరించింది. స్లోగా మార్పు రావడం స్టార్ట్ అయింది.
పీరియడ్‌శాలా స్థాపన
అక్కడితో ఆగని సుర్భి ‘పీరియడ్‌శాలా’ను స్థాపించింది. ఇక్కడ అమ్మాయిలు, మహిళలు పీరియడ్స్ గురించి చర్చించొచ్చు. సందేహాలు ఉండే అడగొచ్చు. కావాల్సిన సమాచారం పొందొచ్చు. ముందుగా తన సెషన్స్‌లో నిశ్శబ్దంగా ఉండే వారు.. ఆ తర్వాత చిన్నగా గుసగుసలాడటం స్టార్ట్ చేశారు. అనంతరం ఇంత మెల్లిగా మాట్లాడుకోవడం ఎందుకని.. ఓపెన్‌గానే చర్చించడం ప్రారంభించారు. కొన్ని ఏండ్లుగా అడగకుండా ఆగిపోయిన.. కాదు కాదు.. నోరు మూసేసి ఆపిన ప్రశ్నలకు ఫైనల్‌గా సమాధానం దొరికింది. ఒకప్పుడు కఠినమైన నిబంధనలను పాటించిన మహిళలు.. ఆ మూఢనమ్మకాలను చాలెంజ్ చేశారు. ఇళ్లలో, స్కూల్స్‌లో, కమ్యూనిటీస్‌లో ఈ డిస్కషన్స్ క్యారీ చేశారు.
ఉపాధి కూడా
సుర్భి తీసుకున్న ఇనిషియేషన్ కేవలం అవగాహనతో మాత్రమే ఆగిపోలేదు. గ్రామ మహిళలకు జీవనోపాధిని కల్పించింది. బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ తయారీలో శిక్షణ ఇప్పించింది. ఇండిపెండెంట్‌గా బతకడాన్ని నేర్పించింది. ఈ విధంగా పీరియడ్ శాలా 25వేల మంది మహిళలను రీచ్ అయింది. మొత్తానికి కొన్ని తరాలుగా ఉన్న సైలెన్స్ ను బ్రేక్ చేసింది.






