UPSC Prelims Result 2026: సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల

by velandi.Saikiran |   (  Updated:2026-06-15 17:42:21  IST  )

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ 2026 ఫలితాలు రిలీజ్ అయ్యాయి.

UPSC Prelims Result 2026: సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల
X

దిశ‌, వెబ్ డెస్క్: యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. కాసేపటి క్రితమే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ 2026 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మెయిన్స్ కు 13,343 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారు. 2026 మే 24వ తేదీన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష కోసం 8,19,372 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ 5.49 లక్షల మంది మాత్రమే ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇక ఇప్పుడు ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు రిలీజ్ అయిన నేపథ్యంలో 13,343 మంది అభ్యర్థులు మెయిన్స్ కు ఎంపిక అయ్యారు. కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ సర్వీసులో 933 పోస్టులు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో 80 పోస్టులను భర్తీ చేయనుంది సర్కార్. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ 2026 ఫలితాల‌ను https://www.upsc.gov.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవ‌చ్చు.

Next Story