- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిగ్రీ విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ల తేదీలు పొడిగింపు
డిగ్రీ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ (DOST) ఫేజ్-3 గడువు పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ (DOST) మూడో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువును జూన్ 22వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిస్తారెడ్డి, కాలేజీ విద్య కమిషనర్ ఎ. శ్రీదేవసేన సంయుక్తంగా ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిగ్రీలో చేరేందుకు అవకాశం కల్పించాలని, విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులందరూ ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
సవరించిన షెడ్యూల్ వివరాలు ఇలా..
మూడో విడత రిజిస్ట్రేషన్లు (రూ. 400 ఫీజుతో): జూన్ 15 నుంచి 21 వరకు
వెబ్ ఆప్షన్లు: జూన్ 16 నుంచి జూన్ 22 వరకు
ప్రత్యేక కేటగిరీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్: జూన్ 22న యూనివర్సిటీ హెల్ప్‌లైన్ సెంటర్లలో నిర్వహిస్తారు.
మూడో విడత సీట్ల కేటాయింపు: జూన్ 25న
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 26 నుంచి జూలై 2 వరకు
కాలేజీల్లో రిపోర్టింగ్: ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3లలో ఆన్‌లైన్ ద్వారా సీట్లు ఖరారు చేసుకున్న విద్యార్థులందరూ జూన్ 27 నుంచి జూలై 4 లోపు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
విద్యార్థుల ఓరియంటేషన్: జూలై 3, 4 తేదీల్లో
మొదటి సెమిస్టర్ తరగతుల ప్రారంభం: జూలై 6 నుంచి తరగతులు ప్రారంభం






